Tsrtc: టీఎస్‌ఆర్టీసీ సరికొత్త యాప్..బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు
Tsrtc: సంక్రాంతి వేళ టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. బస్ ట్రాకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్‌ఆర్టీసీ. ఈ యాప్ ద్వారా ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడ ఉంది..? ఎంతసేపటికి బస్సు ఎక్కాల్సిన ప్రాంతానికి రానుంది? ఎంతసేపటికి గమ్యసానానికి వెళ్లగలుగుతుందో అనే వివరాలను తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ ద్వారా మీ బస్సు ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ చెప్పుకొచ్చింది.
గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి నేరుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ లేదా బస్టాఫ్ వివరాలను ఎంటర్ చేసి మీ బస్సు లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. పండుగ సందర్భంగా సీటు రిజర్వేషన్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతోపాటు బస్ ట్రాకింగ్ లింక్‌ను సందేశ రూపంలో పంపుతున్నారు అధికారులు. లింక్‌పై క్లిక్ చేయగానే సంబంధిత బస్సు ఎకడుందో సులువుగా తెలుసుకోవచ్చు. టీఎస్‌ఆర్టీసీ బస్‌ట్రాకింగ్ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
అలాగే ఈ యాప్ ద్వారా రోడ్డు ప్రమాదం, వైద్య సహాయం, బస్సు బ్రేక్ డౌన్ వంటి వివరాలను అధికారులకు తెలుపవచ్చు. దీని ద్వారా అధికారులు వెంటనే సహాయ చర్యలు తీసుకుంటారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పాటు బస్సు బుక్ చేసుకున్న తర్వాత టికెట్ వివరాలతో పాటు మొబైల్‌కు ఒక లింక్ వస్తుంది. దీని ద్వారా కూడా బస్సు లొకేషన్ వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ సరికొత్త యాప్ ను దాదాపుగా ఇప్పటికే పది లక్షలమంది దాక డౌన్‌లోడ్ చేసుకున్నారని సమాచారం అందుతుంది.