ఈనెల 30న దేశం మొత్తం రాఖీ(Rakhi) పౌర్ణమి పండగను ఘనంగా జరుపుకోనుంది. అన్నా చెల్లెళ్ల అనురాగానికి అద్దం పట్టే ఈ పండగ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,000 స్పెషల్ బస్సుల(Special Buses)ను నడిపించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1,000 బస్సులు చొప్పున నడిపించనుంది టీఎస్ఆర్టీసీ(TSRTC).
TSRTC : ఈనెల 30న దేశం మొత్తం రాఖీ(Rakhi) పౌర్ణమి పండగను ఘనంగా జరుపుకోనుంది. అన్నా చెల్లెళ్ల అనురాగానికి అద్దం పట్టే ఈ పండగ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,000 స్పెషల్ బస్సుల(Special Buses)ను నడిపించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1,000 బస్సులు చొప్పున నడిపించనుంది టీఎస్ఆర్టీసీ(TSRTC). రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.
రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల.. వంటి మార్గాల్లో ఈ ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆదేశించారు. ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించడానికి జూబ్లీ బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టేషన్‌తో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్లల్లో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
గత ఏడాది ఆగస్టు 12వ తేదీన రాఖీ పండుగ నాడు ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సజ్జనార్ గుర్తు చేశారు. ఆ ఒక్కరోజే 87 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే స్పూర్తితో రాఖీ పౌర్ణమి నాడు కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని, రద్దీని క్రమబద్దీకరించాలని అన్నారు. సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పారు. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి. ఆయా రీజియన్ల పరిధిలోని 12 డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు.