TSPSC Scam: 46 మందితో ప్రవీణ్ న్యూడ్ కాల్స్?
TSPSC Scam: తెలంగాణా స్టేట్ స్టాఫ్ పబ్లిక్ కమిషన్ స్కాం ప్రధాన నిందితుడు ప్రవీణ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. 46 మందితో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ వీడియోలు గుర్తించి, వాళ్ళకి కూడా పేపర్ లీక్ చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోపక్క మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్‌తో పాటు పాలుపంచుకున్న రేణుక విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఏడాదిలో ఇప్పటికే 12 సెలవులు పెట్టింది. ఈ నెల 4, 5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టిందని, ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు రేణుక సర్టిఫికెట్ల విషయంలో అనుమానాలు తలెత్తుతుండగా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు సెలవులు రేణుక పెడుతోన్న క్రమంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.