గ్రూపు-1 నోటిఫికేషన్‌కు సర్వం సిద్దం?
తెలంగాణాలో గ్రూపు-1 ఉద్యోగాల తొలి నోటిఫికేషన్ జారీకి సర్వం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన విడుదల చేయడానికి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఇదే అంశంపై టీఎస్‌పీఎస్సీ సభ్యులు సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశంలో 19 ప్రభుత్వ శాఖల్లోని 503 ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదనలన్నింటినీ బోర్డు క్షుణ్నంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించుకుంది. మరో మూడు అంశాలపై ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెలువడిన వాటితో పోలిస్తే తెలంగాణ తొలి గ్రూపు-1 నోటిఫికేషన్ ఇంకా ఎక్కువ పోస్టులతో వెలువడనుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ఇంటర్వ్యూలు రద్దు చేసిన క్రమంలో తొమ్మిది నెలల్లో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు పూర్తిచేసి పోస్టింగ్‌లు ఇవ్వాలని కమిషన్ భావిస్తోంది.