Tspsc: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు వాయిదా
Tspsc: తెలంగాణలో రెండు నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు హ్యాకింగ్‌కు గురైనట్టు అనుమానం రావటంతో.. పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షల్లో ఒకటి నేడు జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సిస్ పరీక్ష కాగా..మరోకటి ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కావటం గమనార్హం. టౌన్ ప్లానింగ్ బిల్డిండ్ ఓవర్సీర్ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్స్ ని కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలో టీఎస్పీఎస్సీలో హ్యాకింగ్ అనుమానంతో రెండు పరీక్షలు వాయిదా పడటంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లు కేవలం ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారమే చోరీ చేశారా లేక, ఇతర పరీక్షల వివరాలు, అభ్యర్థుల సమాచారం కూడా దొంగిలించారా అనేది చర్చగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేసింది. తదుపరి తేదీలను త్వరలో నిర్దేశిస్తామని తెలిపింది.