TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..ఆ పరీక్షలు కూడా!
TSPSC: ప్రశ్నా పత్రాల లీకేజ్ నేపధ్యంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఆ పరీక్షలతో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలు సైతం రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. గత ఏడాది సెప్టెంబరు 16న గ్రూప్-1 503 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. జనవరి 22న ఏఈఈ పరీక్షకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.86 లక్షల మంది పరీక్ష రాశారు, ఇందులో 1:50 నిష్పత్తిలో 25,150 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. ఇక ఫిబ్రవరి 26న డీఏవో పరీక్ష నిర్వహించింది టీఎస్‌పీఎస్సీ. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇక
సిట్ అధికారులు విచారణలో శంకర్ లక్ష్మీ పాస్వర్డ్ డైరీ లో రాయలేదని చెబుతుందని, కానీ ప్రవీణ్ మాత్రం ఆమె డైరీ లో నుండి తస్కరించడాని చెబుతున్నాడని అంటున్నారు. శంకర్ లక్ష్మీ పాత్ర పై దర్యాప్తు చేస్తున్నామని, ఫిబ్రవరి 27 వ తేదీన పేపర్ లను ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాడని అంటున్నారు. ఇక రానున్న మూడు నాలుగు నెలల్లో 20కి పైగా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఉండగా ఇప్పటికే సిద్ధం అయిన అన్ని ప్రశ్న పత్రాలను మార్చబోతున్నట్టు చెబుతున్నారు. ఇక జూనియర్ లెక్చరర్ పరీక్షలు వాయిదా వేశారు. ఎందుకంటే జులై 11న జరగాల్సిన జూనియర్ లెక్చరర్ ఎక్సమ్ పేపర్ సైతం ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో లభ్యం అయిందని అంటున్నారు. మొత్తం రెండు రోజుల్లో నాలుగు పేపర్ లను ప్రవీణ్ కాపీ చేసుకున్నట్టు చెబుతున్నారు.