Tspsc: ఏఈ పరీక్ష రద్దు..టీఎస్పీఎస్సీ
Tspsc: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఏఈ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ. 837 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేసూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు రావడంతో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 5న అసిస్టెంట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడగా.. ఈ పేపర్ పై కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఏఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ నెల 5న పరీక్ష జరగ్గా.. 55వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.