తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నా వేళ దివ్యాంగులకు (Physically Handicapped) శుభవార్త చెప్పారు. వారికి ఇచ్చే పెన్షన్ (Pension)మొత్తాన్ని పెంచారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు రూ.4116 పింఛన్ ఇస్తామన్నారు.
Pension: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నా వేళ దివ్యాంగులకు (Physically Handicapped) శుభవార్త చెప్పారు. వారికి ఇచ్చే పెన్షన్ (Pension)మొత్తాన్ని పెంచారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు రూ.4116 పింఛన్ ఇస్తామన్నారు. ఇంతకుముందు 3,116 ఉండేది తాజాగా వెయ్యి రూపాయలు పెంచారు దీంతో వచ్చేనెలనుండి 4116 పింఛన్ దివ్యాంగులకు అందనుంది. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను తొలుత రూ.500 నుంచి 1,500 కు, రెండోసారి అధికారం చేపట్టిన తరువాత రూ.3,116కు పెంచా రు. తాజాగా వచ్చే నెల నుంచి రూ.4,116 చొప్పున అందివ్వాలని నిర్ణయించారు. ప్రతి నెలా 5,16,890 మందికి లబ్ధిచేకూరనుంది.
18 ఏండ్ల నుంచి 79 ఏండ్ల వయస్సున్నవారికే పింఛన్ ఇవ్వాలన్నది కేంద్రం నిబంధన. చాలా రాష్టాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తుండగా, కొన్ని రాష్టాలు కేంద్రం వాటాకు అదనంగా మరికొంత కలిపి అందజేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 40% కంటే ఎక్కువ వైకల్యం(Handicapped) ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ను (Pension) అందిస్తున్నది. గడచిన తొమ్మిదేండ్లలో ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ కోసం రూ.10,310.36 కోట్లకుపైగా వెచ్చించింది. కేసీఆర్ పాలన దివ్యాంగులకు స్వర్ణయుగం. ఆసరా పెన్షన్లతో దివ్యాంగులకు ఒక భరోసాను కల్పించారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సహాయ ఉపకరణాలు అందిస్తూ బాసటగా నిలుస్తుందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దివ్యాంగుల పింఛన్‌ను మరో రూ.వెయ్యి పెంచడం హర్షణీయమని ఎస్సీ సంక్షేమ, దివ్యాంగులశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eswar) తెలిపారు.