మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు టీఆర్‌ఎస్ నేత ఆత్మహత్య చేసుకోబోయాడు. పరిగి మున్సిపల్ పరిధిలోని తండాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు సేవ్య నాయక్. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు యువకున్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతనం అతన్ని వికారాబాద్ మిషన్ ఆసుపత్రికి తరలించారు.
తనపై కక్ష పెంచుకున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అతని అనుచరుడైన జరుపుల శ్రీనివాస్‌కు చెందిన కారును ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే తగలబెడితే ఆ నేరాన్ని తనపై వేశారని సేవ్య నాయక్ వాపోయాడు. తనపై లేని పోని ఆరోపణలు చేసినందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.