Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం
Revanth Reddy: హాత్ సే హత్ జోడో యాత్ర లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కాన్వాయ్ లో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ధాటికి బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డి కి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు,అయితే ఈ ప్రమాదంలో కొందరు విలేకర్లు స్వల్పగాయాలకు గురైనారు. టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఏబీఎన్, బిగ్ టీవీ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. సిరిసిల్ల రిపోర్టర్లైన వీరందరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.