Congress: హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా.. ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జి మానిక్రావ్ ఠాక్రే (Manikrao thakare) హాజరుకానున్నారు.
Congress: హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా.. ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జి మానిక్రావ్ ఠాక్రే (Manikrao thakare) హాజరుకానున్నారు. అలాగే పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో మండల కమిటీ నియామకం, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే జూన్ 2న గాంధీ కుటుంబం హైదరాబాద్కు రానుంది. ఈ మేరకు చేయాల్సిన ఏర్పాట్లపై కూడా నేతలు చర్చించనున్నారు.
ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. శనివారం కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కాంగ్రెస్ నెక్స్ట్ ఫోకస్ అంతా తెలంగాణపైనే పెట్టింది. కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగా.. టి.కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.