Revanth Reddy: ఇళ్లు లేని వారికి రూ.5లక్షలు.. రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..తొమ్మిదేళ్లలో కేసీఆర్ పది బడ్జెట్లు పెట్టారు. 5 లక్షల 29 వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు. 2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇస్తామన్నారు.
పెళ్లయిన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదని ఆరోపించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించి బీఆర్ఎస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని అన్నారు. 40ఏళ్ల కింద తనకు వేములవాడలో పెళ్లి జరిగిందని ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో కేసీఆర్ చెప్పాడు. చెప్పి ఇన్నేళ్లు గడుస్తున్నా ఆలయ అభివృద్ధికి ఒక రాయి కూడా పంపలేదని అన్నాడు. వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం వ్యకం చేసాడు.