Revanth Reddy: ఇందిరమ్మ రాజ్యానికి ఓటెయ్యండి..రేవంత్
Revanth Reddy: కేంద్ర, రాష్ట్రాల్లో ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర హనుమకొండ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల నుంచి సోమవారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర మొదలైంది. అక్కడి నుండి రాయపర్తి, నర్సక్కపల్లి, మల్లక్కపేట మీదుగా పరకాలకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ మంత్రి కేటీఆర్ పదేపదే ప్రశ్నిస్తున్న సవాల్‌ను స్వీకరించి హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద చర్చకు కూర్చుందామా నేను సిద్ధం మీరు సిద్ధమా? అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ జెండాను విడవకుండా పోరాడుతున్నా.. ఒక్కసారి కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి.. మీ కష్టాలన్నీ తీరుస్తా ‘ఇందిరమ్మ మనవడిని మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానని అన్నారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశమిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి.. పేదోడు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని, గ్యాస్ ధర తగ్గిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇందిరమ్మ దేశ ప్రధానిగా సేవలు అందించి భారతదేశాన్ని అగ్ర దేశాల సరసననిలబెట్టిన ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తెలంగాణాలో తీసుకురావాలన్నదే తన ద్యేయమని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ.23 లక్షల కోట్లు ఎవరి ఇంటికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్‌ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతుంది. తాను భూపాలపల్లికి పోయి అక్కడి ఎమ్మెల్యే, ప్రభుత్వ తీరును ఎండగడితే.. వెంటనే అక్కడ కేటీఆర్ పర్యటించారని అన్నారు ఉమ్మడి వరంగల్ లో నేను పర్యటిస్తుంటే కేటీఆర్ వరంగల్ ఎక్కడ జారిపోతుందో అని వారం రోజుల్లోనే రెండు సార్లు పర్యటనకు వచ్చారన్నారు.