Kumaraswamy: కుమారస్వామి, ప్రకాష్ రాజ్ అందుకే బీఆర్ఎస్ సభకు డుమ్మా కొట్టారా?
Kumaraswamy at BRS Meeting: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నానని ఇప్పటికే ప్రకటించడమే కాదు బీఆర్ఎస్ అనే పార్టీ అనౌన్స్ చేసి తాజాగా ఒక ఆవిర్భావ సభ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కొంతమంది జాతీయ నేతలను సైతం పిలిచి ఆయన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవాన్ మాన్సింగ్, కేరళ సీఎం పినరయి విజయన్ సహా వామపక్షాలకు చెందిన రాజా అనే నేత కూడా హాజరయ్యారు. ఇక ఇదే వేడుకకు హాజరైన అఖిలేష్ యాదవ్ సైతం టిఆర్ఎస్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని భావిస్తూ మేమంతా ఆయనకు మద్దతు పలుకుదామనే వచ్చామని చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అసలు బీఆర్ఎస్ అనే ప్రకటన రాగానే కెసిఆర్ దగ్గర వాలిపోయి ఆయనతో మంతనాలు జరిపిన కర్ణాటక జెడిఎస్ అధినేత కుమారుడు కుమారస్వామి, ఆయనకు కేసిఆర్ కు మధ్య వారధిలా పనిచేశాడని పేరు ఉన్న ప్రకాష్ రాజ్ కానీ కనిపించలేదు.
అయితే కుమారస్వామికి ముందే షెడ్యూల్ కాబడిన వేరే కార్యక్రమాలు ఉన్నాయని బిఆర్ఎస్ వర్గాలు కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ కుమారస్వామి మధ్య గ్యాప్ వచ్చిందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త కలకలం రేగినట్లయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు వారిద్దరి మధ్య తేడా లేకపోతే తన తరపున కానీ పార్టీ తరపున కానీ ఎవరైనా ప్రతినిధిని పంపే అవకాశం ఉంది కదా కానీ అలా జరగలేదంటే ఏదో తేడా జరిగిందని అంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ను 100 లోపు కె పరిమితం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అందుకే ఒక కాంగ్రెస్ నాయకుడికి 500 కోట్ల ఆఫర్ ఇచ్చాడని రేవంత్ ఆరోపించారు. 20 సీట్లు ఓడేలా కుట్ర చేశారని అయితే కుమార స్వామికి కేసీఆర్ ఈ సమాచారం చెప్పలేదని అందుకే కుమార స్వామి రాలేదని రేవంత్ అన్నారు.
ఇక అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఈ సభలో ఎందుకు పాల్గొనలేదు అనే విషయం మీద ప్రశ్నిస్తే ఈ కార్యక్రమానికి కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే ఆహ్వానాలు పంపామని ప్రకాష్ రాజుకి పంపలేదనే వాదన కూడా బీఆర్ఎస్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కర్ణాటకలో పోటీ విషయంలోనే బిఆర్ఎస్0- జెడిఎస్ నేతల మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. కెసిఆర్ జెడిఎస్ కి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ బోర్డర్ లో ఉన్న కర్ణాటక సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద ఒక క్లారిటీ రాకపోవడంతోనే జెడిఎస్ అధినేత ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ జేడీఎస్ కు బీఆర్ఎస్ బేషరతు మద్దతు ఇస్తే అప్పుడు ఇక మీదట జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని లేదంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.