రేపు తెలంగాణలో నడ్డా పర్యటన షెడ్యూల్ ఇదే..!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన పాలమూరు జిల్లాకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పాలమూరు చేరుకోనున్న జయప్రకాశ్ నడ్డా.. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడనున్నారు.
మరోవైపు జేపీ నడ్డా పాలమూరు జిల్లాలో జరిగే సభకు వస్తుండటంతో రాష్ట్రంలో బీజేపీ తన బలం చూపించాలని చూస్తుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సభకు భారీ స్థాయిలో జనాలు వచ్చే విధంగా బీజేపీ నేతలు ప్రత్నిస్తున్నారు. సభను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు.