టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండబోదు: మాణిక్కం ఠాగూర్
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తుందనే వార్తను కొట్టిపడేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్. అవన్నీ అవాస్తవాలే అన్న ఆయన.. ఈ తప్పుడు ప్రచారాన్ని టీఆర్‌ఎస్, బీజేపీ నేతలే చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై పోరాడుతుందన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై తమ పోరాటం ఉంటుందన్నారు.
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒకటి చెబుతుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు మరోకటి చెబుతున్నారని విమర్శించారు. ఇరుపార్టీలపై తాము పోరాటం చేస్తామన్నమణిక్కం ఠాగూర్.. ఈ పోరాటంలో ఒక్క ఇంచు కూడా తగ్గే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం మే 6న వరంగల్‌లో జరిగే బహిరంగ సభ ద్వారా నిరూపిస్తామన్నారు.