Rain Alert: తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిచే ఛాన్స్.. వెళ్లడించిన IMD
Chance of heavy rains in Telangana: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా తెలంగాణను అతలాకుతలం చేసిన వరుణుడు రెండు రోజుల పాటు శాంతించాడు. ఐతే మరోసారి తన ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావం కోస్తాంధ్ర, తెలంగాణలో అధికంగా ఉండే అవకాశం ఉదని తెలిపింది. దీంతో పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నేడు ఉత్తరాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని, రేపు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని బ్యారేజీలకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పరిసర ప్రాంత గ్రామాలు నీటమునిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వందలాది గ్రామాలు నీటిలో నానుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.