కేసీఆర్ వెంట ఉద్యమ ద్రోహులు ఉన్నారు: మధుయాష్కీ
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యమ ద్రోహులను వెంటపెట్టుకొని తిరుగుతున్నారని మండి పడ్డారు. ఉద్యమ సమయంలో మంత్రులు ఎర్రబెల్లి, గంగుల, తలసాని ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వారిని కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్.. ప్రజలకు తిప్పలు తెచ్చిపెట్టారన్నారు. ఉద్యమం చేసిన పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందన్నారు.
రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారీ తల్లి శంకరమ్మను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఇలాంటి వారిని పక్కన పెట్టిన కేసీఆర్ రౌడీలను వెంటపెట్టుకొని తిరుగుతున్నారని మండిడ్డారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి మూలాలు లేకుండా చేస్తానన్న కేసీఆర్.. గంజాయి కట్టడి ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలే గంజాయి సేవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.