Bellamkonda Suresh: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కారులో చోరీ కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్ధం ధ్వంసం చేసి నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు.
Bellamkonda Suresh: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కారులో చోరీ కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు కారు అద్ధం ధ్వంసం చేసి నగదు, ఖరీదైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ (sai ganesh productions) పేరుతో కార్యాలయం ఉంది. గురువారం ఆ కార్యాలయం ఎదుట సురేష్‌కు చెందిన బెంజి కారును (Benz car) నిలిపారు. కారులో రూ. 50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు ఉన్నాయి. అయితే గుర్తుతెలియని వ్యక్తులు కారు బ్యాక్ సీటు వద్దగల అద్దం ధ్వంసం చేసి.. కారులోని నగదు, మద్యం సీసాలను దొంగిలించారు. ఒక్కో మద్యం సీసా ఖరీదు రూ. 28 వేలు ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఘటన అనంతరం సాయి గణేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ సిబ్బంది, సురేష్ సతీమణి పద్మావతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.