K.Lakshman :తెలంగాణలో తాగుబోతుల పాలన కొనసాగుతోంది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Mp Comments on Kcr: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ లక్షణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతుల పాలన కొనసాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్ధంకావడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్న ఆయన.. కేసీఆర్కు సైతం డబుల్ ఇంజన్ భయం పట్టుకుందన్నారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కేసీఆర్ అసహనానికి గురవుతోన్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాతో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతోందన్న ఎంపీ.. కేసీఆర్ మాత్రం తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా, డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చారని విమర్శించారు.
కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడుతుంటే వింతగా ఉందన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతికి పాల్పడుతోందన్నారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్.. కేంద్రంలో కూడా తెలంగాణ తరహా పాలనను తీసుకురావాలనుకుంటున్నారన్నారు. ప్రధాని మోడీని తిడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోబోరని లక్షణ్ హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇస్తే కేసీఆర్కు ఆందోళన ఎందుకని ప్రశ్నించారు.