ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి కారు ప్రమాదం నుంచి తృటిలో భయటపడ్డారు. మెదక్ జిల్లా రాయంపేటకు వెళ్లి వస్తుండగా.. రామయంపేట రైల్వే గేటు వద్దకు రాగానే వేనక నుంచి వస్తున్న మరో కారు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టడంతో ముందు ఉన్న కారు ఎగిరి పడింది. సీటు బెల్ట్ పెట్టుకోవడంతో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం డ్యామేజ్ కావడంతో పోలీసులు ఎమ్మెల్యేను వేరే కారులో పంపించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.