కాళోజీ యూనివర్సిటీ పీజీ సీట్ల గోల్‌మాల్‌పై గవర్నర్ ఆగ్రహం
వరంగల్ కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీలో జరిగిన మెడికల్ పీజీ సీట్ల వ్యవహారంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్‌లో అర్హులైన స్టేట్ ర్యాంకర్లకే సీట్లు ఇవ్వాలన్నారు. మెడికల్ పీజీ సీట్ల గోల్‌మాల్ వార్తతో వైద్యురాలిగా తాను ఆవేదన వ్యక్తం చేసినట్లు తమిళి సై తెలిపారు. దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన వెంటనే వివరణాత్మక నివేదిక సమర్పించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్‌కు గవర్నర్ ఆదేశించారు.
ఇటీవల నార్త్ ఇండియాకు చెందిన విద్యార్థులు ఇక్కడ మెడికల్ పీజీకి చెందిన యాజమాన్య సీట్ల కోసం ప్రయత్నించారు. కానీ యూనివర్సిటీ నిర్వహకులు స్థానిక విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు ఇచ్చేది లేదని తెలిపింది. అయితే కాళోజీ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నట్లు లెటర్లు వెళ్లాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు పీజీ సీట్లను బ్లాక్‌లో పెట్టారు. ఈ సారి కాళోజీ యూనివర్సిటీకి లెటర్లు రావడంతో అసలు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదనే విషయం బయటపడింది. దీనిపై వరంగల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు యూనివర్సిటీ నిర్వహకులు