కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేయాలి: కేశవరావు
టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభలను వాకౌట్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్‌లో ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో ఉభయసభలను వాకౌట్ చేసినట్లు ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేశవరావు తెలిపారు. రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇంతవరకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందన్నారు.
ఎస్సి, ఎస్టీ, ఓబీసీలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ రాక పలు ప్రాంతాల్లో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఎంపీ కేశవరావు గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఉద్యోగ కల్పనపై ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. నిరుద్యోగ యువతకు టీఆర్‌ఎస్ అండగా ఉంటందని, నిరుద్యోగుల పక్షాన కేంద్రంపై ఫైట్ చేస్తామని కేశవరావు స్పష్టం చేశారు.