కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానించింది: హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోలుపై చర్చిస్తే పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను నూకలు తినమని అవమానించారన్నారు. మానవత్వం ఉన్న వ్యక్తి ఆ మాట ఎలా అంటారు అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రికి మానవత్వం లేదని విమర్శించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయన్న హరీష్.. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతేనే ధరలు తగ్గుతాయని ఎద్దేవా చేశారు.
మనల్ని నూకలు తినమన్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలో నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాకే మాట్లాడాలన్నారు. తమ ప్రభుత్వం లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రానున్న రోజుల్లో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోలకు నోటీఫికేషన్ ఇవ్వాలన్నారు