బీజేపీ రైతు వ్యతిరేక విధానాలు పాటిస్తుంది: హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మీద కక్ష కట్టిందన్నారు. గతంలో చాలామంది భారత ప్రధాన మంత్రులగా పని చేశారని, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనను బట్టి వడ్లు కూడా కొనేవాళ్ళన్నారు. వడ్లు కొనుగోలు చేయమని మొండికుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే అని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లకు మద్ధతు ధర ఇచ్చి బియ్యాన్ని ఎలా కొనుగోలు చేస్తుందన్నారు హరీష్ రావు. దేశంలో బీజేపీ రైతుల వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రధాని కంకణం కట్టుకున్నారన్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గించి ఎన్నికల రిజల్ట్స్ రాగానే ధరలు పెంచే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు.