మిల్లర్ల చేతులో కీలుబొమ్మలా ఏపీ ప్రభుత్వం: సోము వీర్రాజు
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో వైసీపీ ప్రభుత్వం కీలు బొమ్మలా మరిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.. రైతులకు డబ్బులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. ధాన్యం డబ్బులపై అధికార నేతలను రైతులు నిదీయ్యగా.. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇంకా నగదు ఇవ్వలేదని, ప్రభుత్వం మీకు ఎలా ఇస్తుందని ఎదురు ప్రశ్న వేస్తున్నారన్నారు. మిల్లర్లు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే వరకు రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని సరైన పద్ధతిలో కొనుగోలు చేయ్యాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో 40 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. FCI ధాన్యం కొనుగోళ్లు చేస్తున్న సమయంలో రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేదని, కానీ ప్రభుత్వం FCIని ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టిందన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నష్ట పోతున్నారన్నారు.