Terroist Training: నిజామాబాద్ లో టెర్రరిస్ట్ ట్రైనింగ్.. రిమాండ్ రిపోర్టులో సంచలనాలు
Terroist Training In Nizamabad: నిజామాబాద్ లో PFI ట్రైనింగ్ పేరుతో ఉగ్ర కార్యకలపాలు నిర్వహించినట్టు గుర్తించారు పోలీసులు. 28 మందిని గుర్తించి FIR చేసిన నిజామాబాద్ పోలీసులు, ఆర్గనైజేషన్ పేరుతో మరో 8 సంస్థలను PFI నడుపుతున్నట్టు గుర్తించారు. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ విమెన్ ఫ్రంట్ లాంటి పేర్లతో ఉగ్ర కార్యకలపాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఇక ఈ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకి వచ్చాయి. PFI ప్రధాన ఉదేశ్యం ఆక్టివ్ ముస్లిమ్స్ కి శిక్షణ ఇవ్వడమే అని గుర్తించారు. ఇక ఇతర మతాల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం స్టోన్ పెల్టింగ్, కత్తులతో శిక్షణ ఇస్తూ యువకులను PFI రెచ్చకొడుతున్నట్టు గుర్తించారు. సోషల్ వర్క్ పేరుతో ఫండ్స్ వసూలు చేసి క్యాడర్ ను PFI పెంచుతున్నట్టు తెలుస్తోంది. డివిజన్, రీజినల్, స్టేట్ క్యాడర్ తో రెగులర్ మీటింగ్స్ పెడుతున్నట్టు కూడా గుర్తించారు. స్కూల్స్, కాలేజ్స్, మదర్సా, మస్జీద్, మోహల్లాస్లో గ్రౌండ్ లెవెల్ లో యువకులను రిక్రూట్ చేయాలని PFI ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.