Telangna Government: గవర్నర్ పై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
Telangna Government: పెండింగ్లో ఉన్న బిల్లులు గవర్నర్ తమిళిసై వెంటనే ఆమోదించేలా చూడమని సుప్రీం కోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. 10 బిల్లులను ఆమోదించకపోవడంపై చీఫ్ సెక్రటరీ రిట్ పిటిషన్ వేసింది. ప్రతివాదిగా గవర్నర్ ను పెట్టగ రేపు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద 8 కీలక బిల్లులు, మరో రెండు సాధారణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు గత ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందగా, వాటిని ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఐదారు నెలలు గడిచినా గవర్నర్ ఆమోదం తెలుపలేదు, ఆ బిల్లుల్లో ఇందులో ఉద్యోగాల నియమకాలకు సంబంధించిన బిల్లులు సైతం ఉన్నాయి.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు
1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు
2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసే బిల్లు
3) ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ
4) మున్సిపల్ చట్ట సవరణ
5) పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ
6) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
7) మోటర్ వెహికిల్ టాక్సేషన్ సవరణ బిల్లు
8) మున్సిపల్ చట్ట సవరణ -2
9) పంచాయతీరాజ్ చట్ట సవరణ-2
10) అగ్రికల్చర్ యూనివర్సిటీ