Viral Infection Cases: ఇన్ఫ్లూయెంజా కేసుల్లో టాప్ 5లో తెలంగాణ
Telangana stood 5th in the list of Viral Infection Cases
ఇన్ఫ్లూయెంజా కేసులు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తం అయింది. ఏ ఏ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నాయో గమనిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సేకవరించిన వివరాల ప్రకారం తెలంగాణలో కేసులు విపరీతంగా ఉన్నట్లు తేలింది. కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది.
తమిళనాడులో అత్యధికంగా 887 కేసులు నమోదవగా, 744 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉందన్నారు. ఢిల్లీ 352 కేసులో ఢిల్లీ మూడో స్థానంలో, 223 కేసులతో యూపీ నాల్గవ స్థానంలో నిలిచింది. 205 కేసులతో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పిల్లలకు మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటున్నట్లు తెలుస్తోంది.
పెద్దవాళ్లు ఓపీ ట్రీట్‌మెంట్‌తోనే కోలుకుంటున్నారని తెలిసింది.
కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టింది. వైద్య రంగంలోని నిపుణులు, ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, వైద్య శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. H3N2 వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలను సేకరించింది. వారిచ్చిన సూచనల ప్రకారం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. బాధిత రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది.