Corona Alert : తెలంగాణలో కరోనా టెర్రర్… భారీగా కేసులు
తెలంగాణలో భారీగా సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నాలుగు మాసాల తర్వాత ఐదు వందలకు చేరువలోకి కోవిడ్ కేసులు చేరగా, కొత్తగా 494 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిక జారీ చేసింది. మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని వైద్య శాఖ సూచించింది. ఇదిలా ఉండగా భారతదేశంలో కొత్తగా మొత్తం 13,313 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,33,44,958కి చేరుకుంది. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఇచ్చిన అప్డేట్ ప్రకారం యాక్టివ్ కేసులు 83,990కి పెరిగాయి. కరోనాతో మరణాల సంఖ్య తాజాగా 38 కాగా, మొత్తం మరణాల సంఖ్య 5,24,941కి చేరుకుంది. ఇక మొత్తం యాక్టివ్ కేసులు 0.19 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.60 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,303 యాక్టివ్ కోవిడ్-19 కేసులు పెరిగాయి. కరోనా కేసుల విషయంలో భారత్ ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మైలురాయిని దాటింది.