Ts Police Recruitment: పోలీసు ఉద్యోగ నియామకాల్లో దేహదారుడ్య పరీక్షలు పూర్తి
Ts Police Recruitment: తెలంగాణలోని పోలీసు ఉద్యోగాల నియామకం కోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు ముగిశాయి. దాదాపు నెల రోజులపాటు నిర్వహించిన వివిధ ఫిజికల్ టెస్టుల్లో మొత్తం 1,11,209 మంది అర్హత సాధించినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది. మొత్తం 2,07,106 మంది హాజరుకాగా, 1,11,209 మంది అర్హత సాధించారు. వీరిలో 83,449 మంది పురుష అభ్యర్థులు కాగా, 27,760 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీళ్లంతా తుది పరీక్షలకు అర్హత సాధించారు.
దేహధారుడ్య పరీక్షలు నిన్నటితో ముగియడంతో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని తుది పరీక్షలను పూర్తి చేసేందుకు పోలీసు నియామక మండలి సిద్ధమైంది. ఎస్సై తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా.. ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్ పోర్టు ఎస్సై, ఫింగర్ ప్రింట్ విభాగం ఏఎస్సై అభ్యర్థులకు మొదటి రెండు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్స్ ద్వారా 17,516 మంది సిబ్బందిని నియమించబోతోంది బోర్డు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి సూచించిన నియమాల ప్రకారం పకడ్భందీగా ఎంపిక ప్రక్రియ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దేహధారుడ్య ప్రక్రియను పూర్తి చేసారు.