Mitta Waterfalls: తెలంగాణ లో మిట్ట జలపాతం గురించి మీకు తెలుసా
Mitta Waterfalls: మిట్ట జలపాతం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, పిట్టగూడ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇందులో ఒకటి కాదు ఏడు జలపాతాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం, ఒక వైపు ఎత్తైన కొండలు మరియు మరోవైపు దట్టమైన అడవుల మధ్య ఉంది. మిట్ట జలపాతాలు అని కూడా పిలువబడే సప్తగుండల జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. వందల ఎత్తైన కొండ చరియల నుంచి జలజలా జారే జలపాతం.. కింద ప్రవహించే నీరు చుట్టూ దట్టమైన అడవి.. నిజంగా ఆఫ్రికా అడవుల్లో ఉన్న అనుభూతి కలిగిస్తోంది ఈ ప్రకృతిని చుస్తే. ప్రకృతి అందాలకు ఆదివాసిల ఆటపాటలకు, అందాల జలపాతాలకు హస్తకళలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు మన తెలంగాణలోని ఆసిఫాబాద్.
అడవి నడుమ పారే గోదావరి గలగలలు.. ఎత్తైన జలపాతాలు అలరిస్తుంటాయి. సప్తగుండాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వాటిల్లో పిట్టగూడ గ్రామ సమీపంలో గల మిట్ట వాటర్ ఫాల్ చూస్తే ఔరా అనిపిస్తుంది. ఎత్తైన రహదారుల..చారిత్రక నిర్మాణాలు..ఇంకా ఎన్నెన్నో అందాలు ప్రకృతిలోని అందాలన్నీ ఒకచోట చేసరినట్టు కనువిందు చేస్తున్నాయి. ఈ అందమైన ప్రదేశం చూడడానికి వెళ్లేవారికి ప్రారంభంలో ఒక ఎత్తైన మంచె కనిపిస్తుంది.ఇది ఆనాటి నిజాం పాలకులు నిర్మించారు. దాని పై ప్రస్తుతం ప్రకృతి అందాలను వీక్షించే ఏర్పాట్లు చేశారు.
ఒక వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని ఉన్న కుంటాల జలపాతం..మరోవైపు ఈ పర్వతాలకు దిగువన ఉండే కెరమెరీ పర్వత పంక్తుల అందాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మిట్టె జలపాతం ఉంది. జిల్లా కేంద్రం నుంచి లింగాపూర్ వరకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో పిట్టగూడ వరకు వెళ్లాలి. ఈ గ్రామం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు అడవిలో నడిచి వెళ్లాలి. మొదట పది అడుగుల ఎత్తు నుంచి జాలువారే పెద్ద మిట్టె వస్తుంది. తరువాత 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారే రెండో మిట్టె కనువిందు చేస్తుంది. పిట్టగూడా నుండి 3కిలోమీటర్లు కాలినడకన వెళితే గాని మిట్ట జలపాతానికి చేరుకోలేం. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని స్థానికులు చెబుతుంటారు. పొరుగు రాష్ట్రాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఆ ఆనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది. వారాంతపు సెలవుల్లో కుటుంబంతో వెళ్లి మంచి ఆహ్లాద కరమైన వాతావరణంలో గడపొచ్చు.