Inter Exams: రేపే ఇంటర్మీడియట్ పరీక్షలు..ఒక్క నిమిషం నిబంధన
Inter Exams: రేపటినుడి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.15 లక్షల మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ సైతం ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా రోడ్లపై ప్యాడ్ ఎత్తి చూపిస్తే బస్సు ఎక్కడైనా ఎక్కించుకునే విధంగా డ్రైవర్లకు ఆదేశాలు కూడా జారీచేశారు. ఏ బస్సులోనైనా విద్యార్థులను ఎక్కించుకోవాలని ఆర్టీసీ అధికారులు డ్రైవర్లకు ఆదేశాలుఇచ్చారు.
రేపటి నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, 16 నుంచి ఏప్రిల్ 4 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైతే అనుమతి నిరాకరించనుంది. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి ఎవరైనా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడితే విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని దీనిపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినప్పటికీ ఫోటో ఆధారంగా చేసుకుని పరీక్షలకు అనుమతినిచ్చారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎం వద్ద మందులతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే పరిక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులోఉంటుందని పోలీసులు తెలిపారు.