TS Inter Exams: నేడే ఇంటర్ పరీక్షలు
TS Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపు పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించరు. ఈ పరీక్షకు నిమిషం నిబంధనను వర్తింపచేసారు అధికారులు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారంతా పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. విద్యాధికారులు ఈ పరీక్షల కోసం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నేటినుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ఇంటి నుంచి పరీక్షా కేంద్రాల వరకు తిరిగి ఇంటికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు ఆర్టీసీ అధికారులు. కాగా విద్యార్థులు హాల్ టిక్కెట్, కన్సేషనల్ బస్‌పాస్‌లపై ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలను అనుమతించబోమని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్షకేందం వద్ద 144 సెక్షన్ అమలులోఉంటుందని పేర్కొన్నారు.