TS Housing: రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మూసివేత..ఇకపై ఆర్‌అండ్‌బీలోనే
Telangana Housing Department: తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక మొదటిసారి అత్యంత కీలకమైన శాఖను క్లోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖలో గృహ నిర్మాణ శాఖను విలీనం చేసారు. సీఎం కెసిఆర్ ఆదేశాలమేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శాఖను రోడ్లు, భవనాల శాఖ లో విలీనం చేసింది. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఆస్తులు, అప్పులతోపాటు సిబ్బంది, నిర్మాణంలో ఉన్న ఇళ్లు తదితర ఇతర వ్యవహారాలనూ ఆర్‌అండ్‌బీకి అప్పగించింది. ఇకపైరోడ్లు, భవనాల శాఖ లోనే ఈ పనులు సాగనున్నాయి.
ఇక ఉద్యోగులు, సిబ్బందిని ఆర్ అండ్ బీ శాఖకు శుక్రవారం బదిలీ చేశారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆస్తులు, పథకాలు, సిబ్బంది బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించేశారు. గృహనిర్మాణ శాఖల అధికారులతో మంత్రి వేముల సమీక్ష నిర్వహించారు. రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. 1977లో వచ్చిన తీవ్రమైన తుపాను ధాటికి తీర ప్రాంతంలోని రెండు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాధితులకు ఇళ్లను నిర్మించేందుకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఈ శాఖను ఏర్పాటు చేశారు. కొత్తగా కడుతున్న సచివాలయం, జిల్లా కలెక్టర్‌ల కార్యాలయాలు, మెడికల్ కాలేజీలు, హైదరాబాద్, వంటి భారీ ప్రాజెక్టులు ఆర్‌అండ్‌బీ తో కలిసి గృహనిర్మాణ శాఖ చూసుకుంటుంది. ఇకపై రాష్ట్రప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్ల్లనుకూడా ఆర్ అండ్ బీ శాఖ చూసుకోనుంది.