Highcourt: తెలంగాణలో అధికారికంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాల్సిందే
Telangana Highcourt: తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. నిజానికి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని , విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపైనే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషనర్లు లంచ్ మోషన్ దాఖలు చేసిన క్రమంలో మధ్యాహ్నం 2.30 కు జస్టిస్ మాధవి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సిందే అని జస్టిస్ మాధవి ధర్మాసనం తీర్పునిచ్చింది. పరేడ్ తో కూడిన వేడుకలు జరగాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇదే విషయం మీద తెలంగాణ గవర్నర్ తమిళ్ సై కూడా ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె మీద బీఆర్ఎస్ నేతలు ఫైర్ కూడా అవుతున్నాడు.