Ys Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Ys Sharmila: పాదయాత్రకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిటిషన్ దాఖలు చేయగా విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసి షర్మిలను మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేయడంతో షర్మిల మరోసారి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు మంగళవారం నాడు విచారణ నిర్వహించింది. పాదయాత్రకు ఎన్నిసార్లు హైకోర్టుకు వస్తారని షర్మిల తరపు న్యాయవాదిని హై కోర్టు ప్రశ్నించగా హైకోర్టు ఇచ్చిన కండిషన్ లను దిక్కరించి మాట్లాడుతుందన్న గవర్నమెంట్ లాయర్ వాదించారు.
ఇక లోకల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కు మాత్రమే స్పందించారన్న పిటిషనర్ తరపు న్యాయవాదిని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు షర్మిల తరపు న్యాయవాదిని ఆదేశించగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను షర్మిల ఉల్లంఘించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. షర్మిల మాట్లాడిన వీడియోను విన్న న్యాయమూర్తి, ఒక వ్యక్తి మహిళపై అటువంటి వ్యాఖ్యలు చేస్తే సహిస్తారా? అభ్యంతకర వ్యాఖ్యలు చేయొద్దు అని పేర్కొన్నారు. అలా పేర్కొంది విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.