Delhi CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగింత
Telangana High Court Alotts MLA Poaching Case to Delhi CBI: హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో వాడివేడిగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని బీజేపీ తరపు దామోదర్ రెడ్డి వాదించారు. బీజేపీ ఏ ఎమ్మెల్యేని కొలుగోలు చేయలేదని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేరాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది సీఎం కేసీఆరే అని లాయర్ దామోదర్ రెడ్డి పేర్కున్నారు. 2014 నుండి 18 వరకు 37 మంది ఎమ్మెల్యేలు TRS లో చేరారని ఆయన అన్నారు. అయితే ఈ క్రమంలో బిజెపి, టిఆర్ఎస్ ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని, బిజెపి పిటిషన్ ను సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసినప్పుడు ఈ అప్పీల్ లో మీ వాదనలు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. మా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా సిట్ తరపు న్యాయవాది దవే వాదించారు.
దానికి సమాధానం చెప్పడానికే రాజకీయాలు ప్రస్తావించాను అని బీజేపీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇక మరో పక్క హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చినా సిట్ మాకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని సీబీఐ తెలిపింది. కేసు వివరాలు ఇస్తే కేసు నమోదు చేసి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. హైకోర్టులో కేసు విచారణ అయ్యేంత వరకు ఆగాలని సిబిఐకి సీజే బెంచ్ తెలిపింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇక అదే సమయంలో ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు బాధ్యతలు ఢిల్లీ విభాగానికి సీబీఐ డైరెక్టర్ అప్పగించారు. ఈ క్రమంలో సీబీఐ ఢిల్లీ ఎస్సీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చింది. సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సీఎస్ కు సీబీఐ లేఖ రాసింది. సోమవారం వరకు కేసు ఫైళ్ళ కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అప్పీలుపై సోమవారం స్పష్టత వచ్చాక ఎఫ్‌ఐఆర్ నమోదు యోచనలో సీబీఐ ఉంది.