ఏపీకి బకాయి పడ్డ తెలంగాణ సర్కార్..క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి
తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలపై కేంద్రం స్పందించింది. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిలు ఉన్న విషయం నిజమేనన్న మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు బకాయిల చెల్లింపుపై ఎలాంటి వివాదాలు లేదని స్పష్టం చేశారు.
అసలుపై ఎలాంటి సమస్య లేదన్న మంత్రి.. వడ్డీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఇంకా బకాయిలు చెల్లించలేదని, దీనిపై ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిందని తెలిపారు.