GO No.59: జీవో 59 పై ప్రభుత్వం కీలక నిర్ణయం
GO No.59: హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాగా ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చ జరిగింది. జీవో 58, 59 కింద భూముల రెగ్యులరైజేషన్ పై సబ్ కమిటీ చర్చలు జరిపగా ఇప్పుడు జీవో 59 పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 59ని సవరిస్తూ మరో జీవోని ప్రభుత్వం జారీ చేసినట్లు తెలుస్తోంది. కట్ ఆఫ్ డేటును ఎత్తి వేస్తూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెసులుబాటు కలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకొని ఉంటున్న వారికి, యూఎల్సీ సర్ ప్లస్ ల్యాండ్ లను క్రమబద్ధీకరణ చేయడం కోసం జీవో 59ని 2014లో ప్రభుత్వం తీసుకొచ్చింది. జూన్ 2 2014 ను కట్ ఆఫ్ డేట్ గా అప్పుడున్న సర్కార్ నియమించింది. ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తూ ఏ రోజు దరఖాస్తు చేసుకుని ఉంటే అదే రోజు ను కట్ ఆఫ్ డేట్ గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.