Telangana Elections: ఫిబ్రవరి చివర్లో అసెంబ్లీ రద్దు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు!
Telangana Elections: బీజేపీ వాళ్ళు పూర్తిగా ఇజ్జతి తప్పి పోయారని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ విమర్శించారు. చనిపోయిన కాంగ్రెస్ నేతలకు కూడా నివాళులు అర్పిస్తున్నారని, అయినా సొంత పార్టీ నేతలను మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. వాజ్ పేయిని మరిచేపోయారని, అలె నరేంద్ర..బద్దం బాల్ రెడ్డి లాంటి వాళ్ళ ను మరిచే పోయారు ..కనీసం వాళ్లకు నివాళి కూడా అర్పించడం లేదని అన్నారు. అసలు కాంగ్రెస్ నేత పీజీఆర్ కి బీజేపీకి ఏం సంబంధం అని రేవెంత్ రెడ్డి ప్రశ్నించారు. మర్రి చెన్నారెడ్డికి బీజేపీకి ఏం సంబంధం? కనీసం సిగ్గు అయినా ఉండాలి కదా అంటూ ఆయన విమర్శించారు. సొంత పార్టీ నాయకులకు నివాళి అర్పించలేరు కానీ.. కాంగ్రెస్ నేతల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఫిబ్రవరి చివర్లో కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తారని పేర్కొన్న రేవంత్ కర్ణాటకతో పాటు.. తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి బడ్జెట్ కూడా పెట్టకపోవచ్చని ఆయన అన్నారు.