CORONA: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
Telangana Corona: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. గడచిన 24 గంటల్లో 28 వేల 912 శాంపిల్స్ పరీక్షించగా, 608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో అత్యధికంగా 324 కొత్త కేసులు హైదరాబాదులోనే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47, ఖమ్మం జిల్లాలో 27 కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో 663 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలు సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 8 లక్షల 9 వేల 337 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8 లక్షల 326 మంది కరోనా నుంచి కొలుకున్నారు. మరో 4 వేల 900 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4 వేల111 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. త్వరలో 18 సంవత్సరాలు పైబడ్డ వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు వేస్తున్నట్లు పేర్కొన్నారు