రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ బృందం భేటీ
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సభ్యులు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీకానున్నారు. ఏప్రిల్ 4న అన్ని వర్గాలకు చెందిన పార్టీ నేతలు ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ నుంచి పిలుపు రావడంతో పార్టీ నేతలందరూ ఢిల్లీకి వెళ్లారు. రాహుల్‌తో సమావేశమై పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు, జగ్గారెడ్డి-రేవంత్ రెడ్డి మధ్య కొనగుతున్న మనస్పర్ధలపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట రాజకీయాల్లో వర్గ పోరు లేకుండా రాహుల్ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయ చేయనున్నారు.
మరోవైపు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన పార్టీ అసమ్మతి నేతలు పార్టీ అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తున్న వారిని పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి పదవులు కేటీయిస్తున్నారని, అసెంబ్లీలో ఎమ్మెల్యేను అవహేళన చేస్తే ప్రశ్నించాల్సిన నేత దూరంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం