TS: తెలంగాణ కేబినెట్ (Telangana cabinet) సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన సమావేశం మొదలయింది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయంలో మొదటిసారి కేబినెట్ సమావేశం జరుగుతోంది.
TS: తెలంగాణ కేబినెట్ (Telangana cabinet) సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన సమావేశం మొదలయింది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయంలో (New secretariat) మొదటిసారి కేబినెట్ సమావేశం జరుగుతోంది. తెలంగాణ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ దశాబ్ది వేడుకలతో పాటు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్ల ఖారారు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పాలనా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే ఈ సమావేశంలో అమరుల స్మృతివనం ప్రారంభ తేదీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు గత అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందిన రెండు బిల్లులను గవర్నర్ తిప్పి పంపడంతో వాటికి సవరణలు మార్పులు, చేర్పులు చేయడంపై చర్చించనున్నారు.