తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ లో పలు రకాల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీవో 111 ను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయించింది. జీవో 111 ను ఎత్తివేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మే 20 నుండి జూన్ 5 వరకు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వగా అందులో ఒక వ్యవసాయ యూనివర్సిటీ ఉందని సమాచారం. ఇక ఫార్మా యూనివర్సిటీ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సెకండ్ రన్ వె నిర్మాణము చేయాలని కూడా నిర్ణయించారు.
ఇక భేటీ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ కరోనతో ఇబ్బంది పడొద్దని 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, కానీ దిక్కు మాలిన, పనికి మాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ లకు అప్పగించాలని బలమైన కుట్ర చేస్తుందని ఆయన విమర్శించారు. ఇక యాసంగి వడ్లను కొనాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. కేంద్రం మీద మహా సంగ్రామం మొదలు పెడతామన్న ఆయన దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కాలుకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాలుకు వేస్తుందనీ అన్నారు. బాయిల్డ్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధం చెప్పారు. మామూలు టైమ్ లో 67 కిలోల బియ్యం వస్తే ఎండ కాలంలో 35 కిలోలు వస్తుంది. ఆ డబ్బును కేంద్రమే భరించాలని అనారు. ఆహార భద్రత కేంద్రం బాధ్యత అని, కేంద్రంలో తెలివి తక్కువ ప్రభుత్వం ఉందని విమర్శించారు. పెట్రోల్ ధరలు కేంద్రం పెంచి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలా? అని ప్రశ్నించారు.