Mlc Election Counting: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..విజయం ఎవరివైపో
Mlc Election Counting: తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 3 గ్యాడ్యువేట్, 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ చేపట్టనున్నారు. అలాగే తెలంగాణలో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరగనుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 13న పోలింగ్ జరిగిన మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అలాగే ఆంద్రప్రదేశ్ లోని 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయులు, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరిగాయి. వాటి ఫలితాలు నేడు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఒక్కో ఎమ్మెల్సీ నియోజకవర్గం లో ఒక్కో పోలింగ్ కేంద్రంను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు సాయంత్రానికే వెలువడే అవకాశం ఉంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు గురువారం రాత్రికి లేదా శుక్రవారం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పేపర్స్ ను మొదటగా బండిల్స్ తయారు చేసి.. అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ప్రతి టేబుల్ వైజ్ గా పంపిణీ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తారని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.