తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఎంసెట్, ఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. జులై 13 ఈ సెట్ ఎంట్రెన్స్ పరీక్ష జరుగనుండగా.. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం.
మరోవైపు జులై 18, 19, 20 తుదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఎంసెట్ పరీక్షకు ఎంత మంది విద్యార్థులు, హజరు అవుతారు, ఈ సెట్‌కు ఎంతమంది హజరవుతారనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.