Minister Talasani Srinivas Yadav: కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న స్వరూపం .. మంత్రి తలసాని
Minister Talasani Srinivas Yadav: సీఎం కేసీఆర్ యాదవుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న స్వరూపం అని మంత్రి అన్నారు మంత్రి తలసాని. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ప్రయాణిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో యాదవులు ఎంతో వివక్షకు గురయ్యారని, అలాంటి వారికి ఇప్పుడు కేసీఆర్ రూ. 11 వేల కోట్లతో రాయితీ గొర్రెలు అందించారని అన్నారు.
హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్‌ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. నీతి నిజాయితికి మారుపేరు యాదవులు అని ముఖ్యమంత్రి అనేక సార్లు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈయాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.