Konda Surekha: కోమటిరెడ్డిపై కొండా సురేఖ సీరియస్.. వారించిన రేవంత్!
Surekha Comments:కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసి పని చేయలేక మనం ఓడిపోయామని సురేఖ అన్నారు. ఇప్పుడయినా కలిసి పని చేయాలని పేర్కొన్న కొండా సురేఖ పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సురేఖ కామెంట్లు చేశారు. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ వ్యక్తిగత అంశాలు మాట్లాడకండి, సమావేశ అజెండా మీదనే మాట్లాడండని కోరారు. వ్యక్తిగత అంశాలు ఏదైనా ఉన్నా… ఇంచార్జిని వ్యక్తిగతంగా కలిసి చెప్పండని అన్నారు. ఈ సమావేశంలో ఎవరి గురించి మాట్లాడొద్దని పేర్కొన్న ఆయన భద్రాచలంలో భారీ సభ ఏర్పాటు చేసుకుని హాత్ సే హాత్ జోడో ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. ఇక ఈ మేరకు పొడెం వీరయ్య, బలరాం నాయక్ నన్ను ఆహ్వానించారని ఆయన అన్నారు. 26 తర్వాత సోనియాగాంధీ.. లేదంటే ప్రియాంక రావాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని అన్నారు. ఇంచార్జి వచ్చే సమావేశాలకు రాని నాయకుల నుంచి వివరణ తీసుకుని తొలగిస్తామని ఆయన అన్నారు. కీలక సమయాల్లో పార్టీ కోసం పని చేయకపోతే పదవులు ఎందుకు? అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6న భద్రాచలంలో భారీ సభ నిర్వహిస్తామని అన్నారు.