Suneel Kanugolu: సునీల్ కనుగోలు నుంచి కీలేక వివరాలు రాబట్టిన పోలీసులు?
Suneel Kanugolu at Cyber Crime: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు విచారణకు హాజరయ్యారు. గంటన్నర పాటు కొనసాగిన సునీల్ కనుగోలు విచారణ జరగగా సునీల్ కనుగోలు స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో డిసెంబర్ 27 తేదీన విచారణకు హాజరు కావాలని 41 A నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసులు ఇచ్చిన 41A నోటీసులను సునీల్ కనుగోలు హైకోర్టులో సవాల్ చేశారు. 41A నోటీసులు పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పి సైబర్ క్రైమ్ విచారణకు సహకరించాలని సునీల్ కనుగోలుకు హైకోర్టు ఆదేశించింది. సునీల్ కనుగోలును విచారణ చేయాలి తప్ప, అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. 41A నోటీసులపై హైకోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోసారి విచారణకు పిలుస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలుకు చెప్పి పంపినట్టు తెలుస్తోంది. వార్ రూం విషయాలు, సోషల్ మీడియా పోస్టింగ్ లపై సునీల్ నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. చూడాలి ఈ అంశం మీద పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది.